
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎలక్షన్కమిషన్ ప్రకటించింది. ఈ నాలుగు స్థానాలకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది. అలాగే, పంజాబ్‌లో కూడా ఒక సీటు కోసం ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా తన పదవికి రాజీనామా చేసి రాష్ట్ర కేబినెట్‌లో చేరడంతో పంజాబ్‌లో ఒక స్థానం ఖాళీ అయ్యింది. ఈ 5 స్థానాలకు పోలింగ్, ఓట్ల లెక్కింపు అక్టోబర్ 24న జరపనున్నట్టు ఈసీఐ ప్రకటించింది.
జమ్మూ కాశ్మీర్‌లో గులాం నబీ ఆజాద్, మీర్ మొహమ్మద్ ఫయాజ్, షమ్షేర్ సింగ్, నజీర్ అహ్మద్ లవాయ్ ల పదవీ కాలం పూర్తయిన తర్వాత 2021లో ఈ సీట్లు ఖాళీ అయ్యాయి. అయితే, ఈ నాలుగు రాజ్యసభ స్థానాలకు మూడు వేర్వేరు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ వెల్లడించింది.