ఉమ్మడి నల్గొండ జిల్లాలో 465 గ్రామపంచాయతీలు, 3,657 వార్డు మెంబర్ల కోసం పోలింగ్‌

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 465 గ్రామపంచాయతీలు, 3,657 వార్డు మెంబర్ల కోసం పోలింగ్‌
  • చివరి పోరుకు సిద్ధంపంచాయతీల్లో ఎన్నికలకు అంతా రెడీ 
  • పోలింగ్​ సెంటర్లకు చేరుకున్న స్టాఫ్, సామగ్రి
  • గొడవలు జరగకుండా భారీ బందోబస్తు

 

నల్గొండ/ యాదాద్రి, వెలుగు:  గ్రామ పంచాయితీల్లో తుది పోరుకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 465 గ్రామపంచాయతీలు, 3,657 వార్డు మెంబర్ల కోసం బుధవారం పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్​, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 

పోలింగ్​, కౌంటింగ్​కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ కేంద్రాలకు మంగళవారం రాత్రివరకే సామాగ్రి, సిబ్బంది తరలింపు పూర్తయ్యింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించారు. సెన్సిటివ్​సెంటరల్లో వెబ్‌కాస్టింగ్‌ చేస్తారు. 

నల్గొండ జిల్లాలో.. 

నల్గొండ జిల్లాలో మూడవ విడతలో దేవరకొండ డివిజన్ లోని చందం పేట, చింతపల్లి, దేవరకొండ, గుడిపల్లి, గుండ్లపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి, నేరేడుగొమ్ము, పెద్ద అదిశర్లపల్లి మండలాల్లోని 269 గ్రామ పంచాయితీలు, 2206 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 42 ఏకగ్రీవం కాగా, 227 పంచాయతీల్లో 720 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 596 వార్డులు ఏకగ్రీవంకాగా 1603 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 4,299 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు

సూర్యాపేట జిల్లాలో ..

సూర్యాపేట జిల్లాలో మూడవ విడతలో హుజూర్ నగర్ డివిజన్ పరిధిలోని చింతలపాలెం, గరిడేపల్లి, హుజూర్ నగర్, మట్టంపల్లి, మేళ్లచెర్వు, నేరేడు చర్ల, పాలకీడు మండలాల్లోని 181 గ్రామపంచాయతీలు, 1,318 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 22 గ్రామాలు ఏకగ్రీవం కాగా 124 గ్రామ పంచాయితీలకు 375 మంది బరిలో ఉన్నారు. 257 వార్డ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 1061 వార్డులకు 2533 మంది పోటీలో ఉన్నారు.

యాదాద్రి జిల్లాలో.. 

యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్​, సంస్థాన్​ నారాయణపురం, మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, మోటకొండూరు మండలాల్లో మూడవ విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఆరు మండలాల్లోని 124 పంచాయతీలు, 1086 వార్డులకు గాను 10 మంది సర్పంచ్​లు, 93 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవమయ్యారు. దీంతో 114 పంచాయతీల్లో 378 మంది సర్పంచ్​ అభ్యర్థులు, 993వార్డుల్లో 2302 మంది పోటీలో ఉన్నారు. 

ఏర్పాట్లు పూర్తి 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడవ విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నల్గొండ జిల్లాలో 83, సూర్యాపేట జిల్లాలో 45 రూట్లను ఏర్పాటు చేసి మంగళ వారం మధ్యాహ్నం నుంచే సిబ్బంది, ఎన్నికల సామగ్రిని పోలింగ్ సెంటర్లకు తరలించారు. నల్గొండ జిల్లాలో 158, సూర్యాపేట జిల్లాలో 116 పెద్దవాహనాలు, నల్గొండ జిల్లాలో 60, సూర్యాపేట జిల్లాలో 53 చిన్న వాహనాలను ఏర్పాటు చేశారు. 

నల్గొండ జిల్లాలో 2,647మంది పీఓలు, 2,959 మంది ఓపీఓలు, 81 మంది స్టేజ్‌-2 అధికారులు, 83 మంది రూట్‌ఆఫీసర్లు, 89 మంది మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహించనున్నారు. 2,647 బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో 1,538 మంది పీఓలు, 2,026 మంది ఓపీఓలు, 147 మంది స్టేజ్‌-2 అధికారులు, 50 మంది రూట్‌ఆఫీసర్లు, 57 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు. 1,204 బ్యాలెట్‌బాక్సులను సిద్ధం చేశారు.

 యాదాద్రి జిల్లాలో జోనల్​ ఆఫీసర్లు, ఆర్​వోలు, పీవోలు, ఓపీవోలతో పాటు స్టాఫ్​ చేరుకున్నారు. ఎన్నికల విధుల్లో 2,457 మంది స్టాఫ్​పాల్గొంటున్నారు. 1056 పోలింగ్​ స్టేషన్లకు బ్యాలెట్​ పేపర్లు, బాక్సులు సహా 53 రకాల సామగ్రి చేరుకున్నాయి. సెంటర్ల ఎదుట గుర్తులు, అభ్యర్థుల పేర్లతో పోస్టర్​లను ఏర్పాటు చేశారు. 

సూర్యాపేట జిల్లా ఓటర్ల వివరాలు.. 

 

మండలం         పురుషులు    మహిళలు    ఇతరులు    మొత్తం 
చింతలపాలెం       12,740        13,316             0               26,056
గరిడే పల్లి               20,348         21,630             7              41,985 
హుజూర్ నగర్        10,013        10,454              0             20, 467 
మట్టంపల్లి              17,104        18,161              0              35,265 
మేళ్లచెర్వు             14,520         15,158              0              29,678 
నేరేడు చర్ల            9,942           10,608              0              20,550 
పాలకీడు                8,991             9,625               0             18,616 
మొత్తం                93,658             98,952              7           1,92,617 

యాదాద్రి జిల్లా ఓటర్ల వివరాలు.. 

మండలం    పురుషులు    మహిళలు    మొత్తం 

అడ్డగూడూరు11,320    11,702    23,022

చౌటుప్పల్​    18,800    19,093    37,893

గుండాల       13,152    12,917    26,069

మోటకొండూరు10,397  10,504   20,901

మోత్కూరు   6528         6687       13,215

నారాయణపూర్​ 19,167  19,022   38,199

మొత్తం     79,364      79,925      1,59,289 

నల్గొండ జిల్లా ఓటర్ల వివరాలు.. 

మండలం    పురుషులు    మహిళలు    ఇతరులు    మొత్తం 

చందం పేట     12,935         12,157               01                  25,093 

చింతపల్లి         21,227         21,421                03                 42,651 

దేవరకొండ      16,511          16,456                01                  32,968 

గుడిపల్లి           6,066             6,205                 00                  12,271 

గుండ్లపల్లి        19,550          19,839                02                 39,391 

గుర్రంపోడు      18,947         19,623                 01                 38,571 

కొండ మల్లేపల్లి 12,993        12,779                 03                  25,775 

నేరేడుగొమ్ము   9,601            9,290                  03                  18,894 

పెద్ద అదిశర్లపల్లి 12,357      12,339                06                   24,702 

మొత్తం             1,30,187     1,30,109                20                2,60,316