హైదరాబాద్​ లోకల్​బాడీ ఎమ్మెల్సీకి ఏప్రిల్​ 23న పోలింగ్

హైదరాబాద్​ లోకల్​బాడీ ఎమ్మెల్సీకి  ఏప్రిల్​ 23న పోలింగ్
  • మార్చి 28న ఎన్నికల నోటిఫికేషన్​ 
  • 28 నుంచి నామినేషన్ల స్వీకరణ
  • ఏప్రిల్​ 23న పోలింగ్.. 25న ఓట్ల లెక్కింపు​

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న నోటిఫికేషన్‌‌‌‌ విడుదల కానున్నది. ఏప్రిల్‌‌‌‌ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌‌‌‌ జరగనున్నది. అదే నెల 25న ఓట్ల లెక్కింపు ఉంటుంది. హైదరాబాద్​ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఉన్న ఎం.ప్రభాకర్​ పదవీ కాలం మే 1తో ముగియనున్నది. 

ఎన్నికల షెడ్యూల్​ 

  • నామినేషన్ల స్వీకరణ ప్రారంభం    మార్చి 28
  • నామినేషన్ల దాఖలుకు
  • చివరి తేదీ    ఏప్రిల్ 4
  • నామినేషన్ల పరిశీలన    ఏప్రిల్ 7
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ    ఏప్రిల్ 9  
  • పోలింగ్    ఏప్రిల్ 23 
  • ఓట్ల లెక్కింపు    ఏప్రిల్ 25