ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్: స్కూళ్లకు సెలవులు.. భారీ వాహనాలపై నిషేధం

ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్: స్కూళ్లకు సెలవులు.. భారీ వాహనాలపై నిషేధం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. మంగళవారం ఉదయం ఏక్యూఐ 498గా నమోదైంది. సాయంత్రం వరకు ఏక్యూఐ 427కి తగ్గినప్పటికీ.. గాలి నాణ్యత ఇంకా ‘సివియర్’ కేటగిరిలోనే ఉంది. వజీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 475 ఏక్యూఐ నమోదైంది. పీఎం2.5, పీఎం10 స్థాయిలు నేషనల్​ స్టాండర్డ్స్​ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాథమిక స్థాయిలో ఐదో క్లాస్ వరకు సెలవులు ప్రకటించారు. 

ఈ పిల్లలకు ఆన్​లైన్ క్లాసులు మాత్రమే ఉంటాయి. అలాగే భారీ వాహనాలను నిషేధించారు. సగం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని, ఆఫీసులు 50% మందితోనే నడపాలని కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, దట్టమైన పొగమంచు వల్ల విజిబులిటీ బాగా తగ్గిపోవడంతో ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగళవారం 228 ఫ్లైట్స్ రద్దు చేశారు, మరో 5 విమానాలను డైవర్ట్ చేశారు.

ప్రమాదంలో పిల్లల ఆరోగ్యం

కాలుష్యం వల్ల పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని, వారిని ఇంట్లోనే ఉంచాలని డాక్టర్లు చెప్తున్నారు. ఎన్95 మాస్క్‎లు ధరించాలని సూచిస్తున్నారు. ఐదో తరగతి వరకు స్కూళ్లకు సెలువులు ఇచ్చారు. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్లాసులు జరుగుతాయి. 6 నుంచి 11 తరగతి వరకు హైబ్రిడ్ మోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, 10 నుంచి 12 విద్యార్థులకు మాత్రం స్కూళ్లలో క్లాసులు కొనసాగుతున్నాయి.