
-
ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని నిరసన
-
మల్లారెడ్డి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు
హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. భోజనంలో పురుగులు, ప్లాస్టిక్ వస్తువులు వచ్చాయని విద్యార్థులు మల్లారెడ్డి యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగారు.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు మద్దతుగా ఎన్ఎస్ యూఐ నాయకులు పాల్గొన్నారు. మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ ధర్నా చేపట్టారు.
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. లక్షల్లో ఫీజులు తీసుకుని పురుగుల మందు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఫైర్అయ్యారు. ఇప్పటికైనా మల్లారెడ్డి వీటిపై వెంటనే స్పందించాలని కోరారు. న్యాయం జరిగేంతవరకు నిరసన విరమించమని తెలిపారు.