
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్–2023 బుధవారం జరగనున్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,05,656 మంది స్టూడెంట్స్అటెండ్ కానున్నారు. ఇందులో అమ్మాయిలు 47,188 మంది ఉండగా, అబ్బాయిలు 58,468 మంది ఉన్నారు. పాలిసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కన్వీనర్ శ్రీనాథ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 296 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10 గంటల నుంచే సెంటర్లలోకి స్టూడెంట్లను అనుమతిస్తామని వెల్లడించారు. ఈ ఎంట్రెన్స్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో మూడేండ్ల ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నట్టు చెప్పారు.
నిమిషం నిబంధన అమలు..
పాలిసెట్‌కు అధికారులు నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. 11 గంటల తర్వాత ఎవరినీ అనుమతించబోమని కన్వీనర్ శ్రీనాథ్ చెప్పారు. హాల్ టికెట్ మీద ఫొటో ఫ్రింట్ కాని వారు ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు.
సెంటర్ కనుక్కోవడం ఇలా..
అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్బీటీఈటీ టీఎస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్ష కేంద్రం లొకేషన్ పై పాలిసెట్ సెంటర్ లొకేటర్ టాబ్‌ను ఓపెన్‌చేయాలి. అక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్‌చేసి, సెర్చ్ చేయాలి. పరీక్ష కేంద్రం కోడ్, స్టూడెండ్ పేరు, సెంటర్ అడ్రస్ కనిపిస్తాయి. గూగుల్ మ్యాప్ ద్వారా పరీక్ష కేంద్రాన్ని ఈజీగా గుర్తించవచ్చు.