హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పాలిసెట్–2022 ఫలితాలను ఇవాళ ఉదయం 11.30 లకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక, శిక్షణ విద్యా మండలి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. https://polycetts.nic.in లింక్ పై క్లిక్ చేసి విద్యార్థులు తమ రిజల్ట్స్ తెలుసుకోవచ్చని పేర్కొంది. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్ ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ సారి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ డిప్లోమాకు వేరు వేరుగా ర్యాంకులు ప్రకటించనున్నారు.
