యథేచ్ఛగా చెరువులు కబ్జా చేస్తున్న రియల్టర్లు

యథేచ్ఛగా చెరువులు కబ్జా చేస్తున్న రియల్టర్లు

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని చెరువులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. చెరువులు, శిఖం భూములు కబ్జాలు గురువుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 1,147 వరకు చెరువులు ఉండగా వీటి పరిధిలో సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆక్రమణలతో చెరువులు తగ్గడంతో సాగు విస్తీర్ణంపై కూడా ఎఫెక్ట్ పడుతోంది. 

ప్రజాప్రతినిధుల అండతో... 

రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు సాగునీటి వనరుల అభివృద్ధికి చర్యలు చేపడుతుంటే.. మరో వైపు అధికార పార్టీ లీడర్లే రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి చెరువులను కబ్జా చేస్తున్నారు. డిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 98 ఎకరాల్లో ఉన్న రాజరాజేశ్వరి చెరువులో దాదాపు 8 ఎకరాలను కబ్జా చేసినట్లు తెలుస్తోంది. నడిపల్లి పంచాయతీ పరిధిలో నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవే 44 పక్కనే 35 ఎకరాల్లో ఏదుల్లా చెరువు ఉంటుంది. ఇందులో 30 శాతం కబ్జాకు గురైంది. ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో కబ్జాకు గురైన భూమికి కన్వర్షన్లు కూడా లభించినట్లు సమాచారం. దీనిపై 
పైఆఫీసర్లకు కూడా ఫిర్యాదు అందాయి. జిల్లాలో మొత్తం 1,147 చెరువుల్లో 15 శాతం అంటే161 చెరువులు కబ్జాల పాలవుతున్నాయని ఇటీవల పలు సర్వేల్లో తేలింది. ప్రధానంగా నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవే 44 పక్కన ఉన్న బాల్కొండ, ఆర్మూర్, జక్రాన్‌‌‌‌‌‌‌‌ పల్లి, డిచ్‌‌‌‌‌‌‌‌పల్లి, ఇందల్వాయి మండల కేంద్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ఆ మండలాల పరిధిలో ఉన్న చెరువులపై రియల్టర్ల కన్ను పడింది. నాందేడ్ నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవేలో ఎడపల్లి, బోధన్ మండలాల చెరువులు కూడా కబ్జాలకు గురై రియల్ వెంచర్లు వెలుస్తున్నాయి.

సర్వే చేసి కాపాడాలి

జిల్లాలో చెరువుల కబ్జా విచ్చలవిడిగా సాగుతోంది. కబ్జాల వల్ల చెరువు పరిధి, నీటి సామర్థ్యం తగ్గి సాగుపై ఎఫెక్ట్​ పడుతోంది. ఆఫీసర్లు ఇప్పటికైనా స్పందించాలి. 1975 రికార్డుల రీ సర్వే చేసి చెరువులను కాపాడాలి.
- వాసరి సాయినాథ్, ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​ 

విచారణ చేపడుతాం...

చెరువుల కబ్జాలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపడుతాం. నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవే పక్కన ఉన్న చెరువు స్థలం కబ్జాకు గురైనట్లు మా దృష్టికి వచ్చింది. సర్వే జరిపేందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. కిందిస్థాయి అధికారుల పాత్రపై విచారణకు ఆదేశించాం.   
- శ్రీనివాస్, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి

కబ్జాలతో రియల్ దందా..

అధికార పార్టీ అండతోనే కొందరు చెరువులను కబ్జా చేస్తున్నరు. చెరువు భూములను ఏకంగా ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో చెరువులు కనుమరుగవడం ఖాయం.
 - భాను, ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్