V6 News

గ్రామాల అభివృద్ధే లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

గ్రామాల అభివృద్ధే లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

టేకులపల్లి, వెలుగు: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఆయన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఐటీడీఏ ద్వారా మంజూరైన మొక్కంపాడు - పూబెల్లి రోడ్డు, మద్రాస్ తండా - మేల్లమడుగు గ్రామాల మధ్య బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

కోయగూడెంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు, ఐటీడీఏ పీవో రాహుల్, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, అడిషనల్​ కలెక్టర్ విద్యా చందన, ఆర్డీవో మధు, తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీవో మల్లేశ్వరి, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినులకు అభినందన 

ఖమ్మం టౌన్: ఖమ్మం రాపర్తి నగర్‌‌‌‌‌‌‌‌లోని తెలంగాణ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్​ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు ఆఫీస్​లో బుధవారం విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.