
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనన్న మాటకు తాను కట్టుబడి ఉన్నానని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఇంకా 58 రోజుల టైమ్ మాత్రమే ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ దందాలు బయట పెడతామని పొంగులేటి హెచ్చరించారు.
బీజేపీతో రాత్రి, మజ్లిస్ తో పగలు ఆలయ్ బలయ్ గా కేసీఆర్ ఉంటారని, ప్రజలు అంతా గమనిస్తునే ఉన్నారని పొంగులేటి అన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ అంటూ కేసీఆర్ మోసం చేశారని, పోరపాటున కేసీఆర్ మూడోసారి సీఎం అయితే గుడిసె కూడా లేకుండా చేస్తాడని విమర్శించారు. టక్కరి,మాయ, మోసగాడు కేసీఆర్ అన్నారు. అధికారం ఎపుడూ మీ అబ్బా సొత్తు కాదని హెచ్చరించారు.
ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని పొంగులేటి చెప్పుకోచ్చారు. తమ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని, తనకు కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తెలుసునని వెల్లడించారు.