
- బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ముడా స్కామ్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కర్నాటక సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ కర్నాటక, తమిళనాడు కో ఇన్ చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నాటక రాష్ట్రంలోని దొడ్డబళ్లాపుర నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.
ముడా స్కామ్ విచారణ నుంచి తప్పించుకోవాలనుకున్న సిద్ధరామయ్య ఎత్తుగడలకు ఆ రాష్ట్ర హైకోర్టు బ్రేక్ వేసిందని చెప్పారు. ఇకనైనా నైతిక బాధ్యత వహించి, ఆయన సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్రమోదీ విజనరీ నాయకత్వంలో బీజేపీ సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారని చెప్పారు.