ఎన్డీయే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఎన్డీయే సంక్షేమ పథకాలను  ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • పార్టీ నేతలకు బీజేపీ తమిళనాడు సహ ఇన్‌‌‌‌ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పిలుపు

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పార్టీ నేతలకు బీజేపీ తమిళనాడు, కర్నాటక రాష్ర్టాల సహ జాతీయ ఇన్‌‌‌‌ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి సూచించారు. డీఎంకే అవినీతిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

 సోమవారం చెన్నైలో బీజేపీ తమిళనాడు కోర్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. దీనికి తమిళనాడు ఎన్నికల ఇన్‌‌‌‌ఛార్జ్ బై జయంత్ పాండా, తమిళనాడు ఇన్‌‌‌‌ఛార్జ్ అరవింద్ మీనన్, కేంద్ర సహాయ మంత్రి, తమిళనాడు ఎన్నికల సహ -ఇన్‌‌‌‌ఛార్జ్ మురళీధర్ మోహోల్, బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు  నైనార్ నాగేంద్రన్, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై, మాజీ గవర్నర్ తమిళిసై , హెచ్.రాజా సహా పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు.

 ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. డీఎంకే ప్రభుత్వ వైఫల్యాలను  ప్రజలకు వివరించాలని, ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన మంచి పాలన కార్యక్రమాలను తమిళనాడులోని ప్రతి గడపకూ తీసుకెళ్లాలని నేతలు తీర్మానించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైన కార్యాచరణపై  చర్చించారు.