మేడిగడ్డ పేరుతో మభ్యపెడుతున్నరు : పొన్నాల లక్ష్మయ్య

మేడిగడ్డ పేరుతో మభ్యపెడుతున్నరు : పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ పేరుతో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోందని బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గాయత్రి పంపు హౌస్​ నుంచి నీళ్లు వదిలారన్నారు. సాగు, తాగు నీళ్లపై కాంగ్రెస్ నేతలు చర్చకు రావాలని సవాల్ ​విసిరారు. మంగళవారం తెలంగాణ భవన్‌‌‌‌లో దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్మేలు గాదరి కిషోర్‌‌‌‌, బాల్క సుమన్‌‌‌‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు.

48 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చొని కేసీఆర్‌‌‌‌పై సీఎం రేవంత్  రెడ్డి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఎలుక‌‌‌‌తో కేసీఆర్‌‌‌‌ను పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ సింహం లెక్క జనం కోసం కదిలారన్నారు. కేసీఆర్ ఒక్కరోజు బయటికి వస్తే కాంగ్రెస్ మంత్రులు ఉలిక్కిపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. పోన్ ట్యాపింగ్ ప్రభుత్వానిదా? ప్రైవేటుదా? తేల్చాలన్నారు.