
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న సీఎం కేసీఆర్..అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఐదేళ్ల పాలనలో లక్షా 85 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా పండుగలో పాల్గొన్న పొన్నం..పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు..కలగానే మిగిలిందన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుక లేకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు పొన్నం