కొన్నామని చెప్తున్నది ఎంత? అసలు కొన్నది ఎంత? మంత్రి గంగుల కమలాకర్కు పొన్నం ప్రభాకర్ సవాల్

కొన్నామని చెప్తున్నది ఎంత? అసలు కొన్నది ఎంత? మంత్రి గంగుల కమలాకర్కు పొన్నం ప్రభాకర్ సవాల్

ధాన్యం కొనుగోళ్ల విషయంపై మంత్రి గంగుల కమలాకర్ కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్లలో గంగుల కమలాకర్ చెప్తున్నది అవాస్తవాలని  పొన్నం విమర్శించారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం.. తేదీ 27 ఏప్రిల్ 2023 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 4 లక్షల 81 వేల 44 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని తేలింది.

అందులో 11 జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ధాన్యపు గింజ కొనుగోలు జరగలేదని పొన్నం ప్రభాకర్. కమాలాకర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి మాటలు మానుకోవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. 

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు, ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయవలసిన ఏర్పాట్ల విషయంలో జాప్యం చేసిందని పొన్నం మండిపడ్డారు. చేయవలసిన పనులు ముందుగా చేసుంటే.. ఆకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగి ఉండేది కాదని పొన్న వెల్లడించారు.

ఆదుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించకపోగా, తడిసిన ధాన్యాన్ని కొనకుండా.. తాలు, తరుగు, తేమ పేరుతో కోతలు విధిస్తూ రైతులను ఆవేదనకు గురిచేస్తుందని మండిపడ్డారు.