దమ్ముంటే మా ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి: మంత్రి పొన్నం

దమ్ముంటే మా ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి: మంత్రి పొన్నం

బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆరుగురు మంత్రులు బీజేపీతో టచ్ లో ఉన్నారని.. మేము గేట్లు ఎత్తితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు మహేశ్వర్ రెడ్డి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రొ పొన్నం.. దమ్ముంటే మా ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండంటూ వార్నింగ్ ఇచ్చారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేనినైనా ఎదుర్కొనే శక్తి మా ప్రభుత్వానికి ఉందన్నారు. కొంతమంది మూర్ఖులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. బలహీన వర్గాలకు చెందిన బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారని మంత్రి విమర్శించారు.

బలహీన వర్గాలకు మేలు చేసేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు పొన్నం. కనీసం పార్టీ పదువుల్లోనైనా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. బీసీ యువతకు ఉచిత శిక్ష ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. నాలుగు నెలల్లోనే అనేక పథకాలను తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడిస్తామని.. రాష్ట్రంలో 14కు పైగా ఎంపీ స్థానాలను గెలుస్తామని మంత్రి పొన్నం ధీమా వ్యక్తం చేశారు.