
కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది పూజా హెగ్డే. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో టాప్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుని బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారింది. అయితే అవకాశాలు వస్తున్నా.. గత కొన్నాళ్లుగా ఆమెను వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ‘రెట్రో’ సైతం డిజాస్టర్‌గా నిలవడంతో పూజా నిరూత్సాహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతో ఆమె ఖాతాలో ఏడు వరుస ఫ్లాపులు చేరాయి. ఇది తన కెరీర్ మీద పడే చాన్స్ ఉంది.
ప్రస్తుతం అయితే పూజా హెగ్డే.. విజయ్‌కు జంటగా ‘జన నాయగన్’ చిత్రంతో పాటు లారెన్స్ ‘కాంచన4’ చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు రజినీకాంత్ ‘కూలీ’ సినిమాలో స్పెషల్ అప్పీరియెన్స్ ఇవ్వబోతోంది. అలాగే హిందీలో వరుణ్ ధావన్‌కు జంటగా ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ చిత్రం చేస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో పూజా ఆశలన్నీ ఈ సినిమాలపైనే ఉన్నాయి. వీటిలో ఒక్క చిత్రమైనా తనకు తిరిగి మళ్లీ మంచి రోజులు తీసుకొస్తుందనే నమ్మకం పూజా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.