బుట్టబొమ్మ ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయిందా?

బుట్టబొమ్మ ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయిందా?

హైదరాబాద్: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. బుధవారం రాత్రి తన ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయిందనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా పూజ తెలిపింది. డిజిటల్ టీమ్ తో గంట సేపు కష్టపడి తిరిగి తన అకౌంట్ ను ఆమె రిట్రీవ్ చేసుకుంది. తన అకౌంట్ సేఫ్టీ గురించి పూజ వర్రీ అయింది. తన ఫాలోవర్స్ ను వారి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను హ్యకర్ కు పంపొద్దని ఆమె విజ్ఞప్తి చేసింది.

‘హాయ్ గాయ్స్, నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయిందని టీమ్ ద్వారా తెలుసుకున్నా. దీని కోసం నా డిజిటల్ టీమ్ నాకు సాయం చేస్తున్నారు. దయచేసి ఎవరి నుంచి ఇన్విటేషన్స్ వచ్చినా యాక్సెప్ట్ చేయకండి. ఎవరైనా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వకండి. థ్యాంక్యూ’ అని పూజ ట్వీట్ చేశారు.

కొన్ని గంటల తర్వాత టెక్నికల్ టీమ్ సాయంతో ఆమె తిరిగి తన అకౌంట్ ను రిట్రీవ్ చేసుకుంది. ఈ సందర్భంగా మరో ట్వీట్ చేసిన బుట్టబొమ్మ..‘నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ సేఫ్టీ గురించి చాలా సేపు ఒత్తిడిని ఎదుర్కొన్నా. ఇందులో నుంచి బయటపడేందుకు సాయం చేసిన నా టెక్నికల్ టీమ్ కు కృతజ్ఞతలు. మొత్తానికి ఇన్ స్టా అకౌంట్ ను తిరిగి పొందాను. గడిచిన ఒక గంట సమయంలో నా అకౌంట్ నుంచి ఏదైనా మెసేజ్ లేదా ఫాలో బ్యాక్, పోస్ట్ చేసినట్లయితే వాటిని తొలగిస్తాం. థ్యాంక్యూ’ అని పూజ ట్వీట్ చేసింది.

హ్యాకర్ పూజ అకౌంట్ నుంచి కొన్ని మీమ్స్ ను షేర్ చేశాడు. అందులో ఓ మీమ్ సమంత నటించిన మజిలీ మూవీలోనిది. ఈ మీమ్ కు కామెంట్ చేస్తూ ‘తను నాకు అంత అందంగా కనిపించట్లేదు’ అని క్యాప్షన్ రాసి ఉంది. అల వైకుంఠపురం భామ పూజ ప్రస్తుతం సొంతింట్లో పేరెంట్స్ తో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంది. అఖిల్ అక్కినేనితో కలసి యాక్ట్ చేసిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రిలీజ్ కోసం ఆమె ఎదురుచూస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ సరసన నటిస్తున్న ఫిల్మ్ షూటింగ్ లో పూజ బిజీ కానుంది.