Poonam Pandey: పూనమ్ పాండేపై రూ.100 కోట్ల పరువునష్టం దావా

Poonam Pandey: పూనమ్ పాండేపై రూ.100 కోట్ల పరువునష్టం దావా

బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే (Poonam Pandey)..అంతేకాదు వివాదాస్పద నటి పూనమ్ పాండే గురించి గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వీపరీతంగా వినిపిస్తోంది. పూనమ్ పాండే ఇటీవల తను చనిపోయినట్లు చేసిన స్టంట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో తనపై విమర్శలు తలెత్తుతున్నాయి.  

తాజాగా పూనమ్ పాండే,ఆమె భర్త  సామ్ బాంబేపై కాన్పూర్ కోర్టులో రూ.100 కోట్లకు దావా దాఖలైంది. ఫైజాన్ అన్సారీ అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ పూనమ్ చేసిన స్టంట్‌పై కంప్లైంట్  చేశాడు. సర్వైకల్ క్యాన్సర్తో పూనమ్ తన బూటకపు మరణ వార్తను వ్యాప్తి చేయడం వల్ల దేశ ప్రజల మనోభావాలను.. పూనమ్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాన్ని అపహాస్యం చేశారని ఫైజాన్ అన్సారీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

వెంటనే పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై కఠిన చర్యలు తీసుకోవాలని..ఈ విషయంపై తక్షణమే విచారణ చేయాలంటూ ఫైజాన్ అన్సారీ తన కంప్లైంట్ లో తెలిపాడు.మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారో తెలియాల్సి ఉంది.

పూనం పాండే గర్భాశయ క్యాన్సర్తో చనిపోయినట్లు ఫిబ్రవరి 2వ తేదీన మొదలైన ఈ న్యూస్..అందరినీ షాక్ కలిగేలా చేసింది. ఇక అంతలోనే..తాను చచ్చిపోలేదు..అంత నాటకం..కేవలం సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన తీసుకురావడానికి అంటూ వీడియో రిలీజ్ చేసి ఒక్కసారిగా ఆశ్చర్యం కలుగజేసింది.

దీంతో పూనమ్ పాండే చావు డ్రామాపై నెటిజన్స్ నుంచి సినీ లవర్స్ వరకు విభిన్నమైన శైలిలో రియాక్ట్ అవుతటు వస్తున్నారు. అంతేకాదు ఈ స్టంట్ తర్వాత పూనమ్ కు అసలైన కష్టాలు మొదలయ్యాయి. 

Also Read : పేర్లు చెప్తే కాంట్రవర్సీ.. సినిమాలు నచ్చలేదు.. పీవీ సింధు ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌