శిల్పాశెట్టి భర్త ఇంతగా మోసం చేస్తాడనుకోలె

V6 Velugu Posted on Jul 23, 2021

ముంబై: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, బిజినెస్‌మెన్ రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. సినీ అవకాశాల పేరుతో అమాయక అమ్మాయిలు, మహిళల్ని పోర్న్‌లోకి దింపుతున్నాడని కుంద్రాపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే స్పందించింది. కుంద్రా అరెస్టుపై హర్షం వ్యక్తం చేసిన పూనమ్.. తన మనసంతా శిల్పా, ఆమె పిల్లలతోనే ఉందని తెలిపింది. రాజ్ కుంద్రా తనను మోసం చేశాడని.. పోర్నోగ్రఫీ కేసులో న్యాయం గెలిచి తీరుతుందని పూనమ్ స్పష్టం చేసింది.  

రాజ్ కుంద్రా, తాను కలసి 2019లో ఒక యాప్‌ను ప్రారంభించామని, ఆ యాప్ లావాదేవీల విషయంలో అతడు తనను మోసం చేశాడని పూనమ్ ఆరోపించింది. ఈ వ్యవహారానికి సంబంధించి తాను బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని పేర్కొంది. ‘ఒక కాంట్రాక్ట్‌కు సంబంధించిన ఎంవోయూ మీద సంతకం చేస్తున్నప్పుడు రాజ్ కుంద్రా మోసం చేస్తున్నాడని అర్థమైంది. అందుకే ఆ కాంట్రాక్టు నుంచి వెంటనే వైదొలిగా. ప్రొఫెషనల్‌గా ఇలాంటి వ్యక్తితో కలసి పని చేయడం నా జీవితంలో చేసిన పెద్ద తప్పుగా భావిస్తున్నా. అతడో మోసగాడు. రాజ్ కుంద్రా టీమ్ నా ఫోన్ నంబర్‌ను లీక్ చేసింది. నా అకౌంట్‌ను, పర్సనల్ డేటాను హ్యాక్ చేశారు. నా లైఫ్ తెరిచిన పుస్తకం లాంటిది' అని పూనమ్ వ్యాఖ్యానించింది.

Tagged Mumbai Police, poonam pandey, Raj Kundra, shilpa shetty, Shilpa Shetty Husband, Pornography Case

Latest Videos

Subscribe Now

More News