పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లు .. సినీ నటుడు విజయ్ దేవరకొండ..

పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లు .. సినీ నటుడు విజయ్  దేవరకొండ..
  • స్వగ్రామం తుమ్మన్​పేటలో దేవరకొండ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో పంపిణీ

అచ్చంపేట, వెలుగు: పేద విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దేవరకొండ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మెరిట్​ స్టూడెంట్లకు స్కాలర్​షిప్​లు అందజేస్తున్నట్లు సినీ నటుడు విజయ్​ దేవరకొండ తెలిపారు. ఆదివారం నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలోని 45 గవర్నమెంట్ స్కూళ్లలో 9, 10 తరగతిలో ఫస్ట్, సెకండ్  వచ్చిన 181 మంది స్టూడెంట్లకు స్కాలర్​షిప్​లు పంపిణీ చేశారు.

 విజయ్​ దేవరకొండ స్వగ్రామమైన తుమ్మన్ పేట సమీపంలోని ఓ ఫంక్షన్  హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సతీమణి, సినీ నటి రష్మిక మందన, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి విద్యార్థులకు స్కాలర్​షిప్​లు అందజేసి అభినందించారు. ఫస్ట్  వచ్చిన వారికి రూ.10 వేలు, సెకండ్  వచ్చిన స్టూడెంట్లకు రూ.5 వేల ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమల ప్రాంతంలోని పేద విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

 విడతల వారీగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. విద్యార్థులు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలని సూచించారు. విద్యతోనే ఏదైనా సాధించవచ్చనే విషయాన్ని గుర్తించాలన్నారు. డీఈవో రమేశ్ కుమార్, విజయ్  దేవరకొండ కుటుంబ సభ్యులు, టీచర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.