శాంతి శాంతి..ఉక్రెయిన్, గాజాలో శాంతి నెలకొనాలి

శాంతి శాంతి..ఉక్రెయిన్, గాజాలో శాంతి నెలకొనాలి
  • ప్రపంచ దేశాలకు పోప్  లియో పిలుపు

వాటికన్ సిటీ: ఉక్రెయిన్, గాజాలో వెంటనే శాంతి నెలకొనేలా చూడాలని ప్రపంచ దేశాలకు పోప్  లియో పిలుపునిచ్చారు. గాజాలో బందీల విడుదల కోసం కృషి చేయాలని, మానవతా సాయం అందేలా చూడాలని ఆయన సూచించారు. మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్లకుండా చూడాలన్నారు. క్యాథలిక్  చర్చి హెడ్  హోదాలో సెయింట్  పీటర్స్  బసిలికాలో మొదటిసారిగా ఆదివారం భక్తులను ఉద్దేశించి ఆయన  ప్రసంగించారు. 

ఇక యుద్ధం వద్దే వద్దు అని అన్నారు. 80 ఏండ్ల క్రితం జరిగిన రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఎంతో వినాశనం జరిగిందని ఆయన గుర్తుచేశారు. నేటికీ ప్రపంచాన్ని ఎన్నో సమస్యలు, వివాదాలు అతలాకుతలం చేస్తున్నాయని, దివంగత పోప్  ఫ్రాన్సిస్  కొన్ని వివాదాలను పరిష్కరించారని తెలిపారు.