ఆన్‌లైన్ క్లాసులో పోర్న్ వీడియో అప్‌లోడ్

ఆన్‌లైన్ క్లాసులో పోర్న్ వీడియో అప్‌లోడ్

ఆన్‌లైన్ క్లాసులో పోర్న్ వీడియో అప్‌లోడ్
కరోనావైరస్, లాక్‌డౌన్ సమస్యలతో విద్యార్థులకు చాలాకాలంగా ఆన్‌లైన్ క్లాసులే జరుగుతున్నాయి. అయితే ఈ ఆన్‌లైన్ క్లాసుల పుణ్యమా అని చాలామంది విద్యార్థులు పెడదోవ పడుతున్నారు. చాలామంది తమ చదువు కోసం స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తుంటే.. కొంతమంది మాత్రం చదువును పక్కన పెట్టి ఆటలకు, అశ్లీలానికి అలవాటుపడుతున్నారు. ఇలా పోర్న్ వీడియోలకు అలవాటుపడిన రాజస్థాన్‌కు చెందిన ఓ 15 ఏళ్ల బాలుడు..  ఆన్‌లైన్ క్లాస్ జరుగుతుండగా.. గ్రూప్‌లోకి పోర్న్ వీడియో అప్‌లోడ్ చేశాడు. 

ఇదే తరహా ఘటన ముంబైలోని ఓ కాలేజీలో జరిగింది. విలే పార్లేలో ఉన్న ఓ కాలేజీ.. కరోనా దృష్ట్యా ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తుంది. అయితే కొంతమంది దుండగులు ఈ కాలేజీ ఆన్‌లైన్ క్లాసుల లింకును హ్యాక్ చేసింది. విద్యార్థులు, గెస్ట్ లెక్చరర్లు మరియు కాలేజీ లెక్చరర్లు మొత్తం 65 మంది ఈ ఆన్‌లైన్ క్లాసులో పాల్గొన్నారు. అదే సమయంలో దుండగులు.. లింక్‌లోకి 40 నిమిషాల అశ్లీల వీడియోను అప్‌లోడ్ చేశారు. దాంతో ఆన్‌లైన్‌లో ఉన్నవారి స్క్రీన్‌ల మీద ఆ వీడియో ప్లే అయింది. దాంతో విద్యార్థులు, లెక్చరర్లు అందరూ తమ స్క్రీన్లను ఆఫ్ చేశారు.

కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో జుహు పోలీసులు నిందితుల మీద ఐపీసీ మరియు ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి సైబర్ సెల్ పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సీనియర్ అధికారి శశికాంత్ మానే తెలిపారు.