చెన్నై పోర్టులో 12 కోట్ల విలువైన చైనా బాణాసంచా సీజ్

చెన్నై పోర్టులో 12 కోట్ల విలువైన చైనా బాణాసంచా సీజ్

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని పోర్టులో 12 కోట్ల విలువైన చైనా బాణసంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ DRI జోనల్ యూనిట్‌కు అందిన పక్కా సమాచారంతో ఆపరేషన్ నిర్వహించారు.

స్టేషనరీ, మెడికల్ గ్లౌజులు, ప్లాస్టిక్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, షూ ర్యాక్స్ పేరుతో అక్రమంగా దిగుమతి చేసుకుని.. కంటైనర్లలో సరుకు వెనుక భారీగా చైనా ఫైర్‌వర్క్స్ దాచారు. అనుమానాస్పద కంటైనర్లను DRI అధికారులు తనిఖీ చేశారు.

తనిఖీల్లో చైనా తయారీ బాణసంచా పెద్ద మొత్తంలో బయటపడింది. మొత్తం స్వాధీనం చేసుకున్న బాణసంచా విలువ సుమారు 12 కోట్లు కావడం గమనార్హం. DGFT, PESO అనుమతులు లేకుండానే దిగుమతి చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది.

తప్పుడు డిక్లరేషన్, దాచివేతతో అక్రమ రవాణాకు యత్నించినట్లు తేలింది. Customs Act, 1962 కింద బాణసంచా స్వాధీనం చేసుకుని.. ఆర్గనైజ్డ్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌పై DRI దర్యాప్తు చేస్తుంది.