లాక్ డౌన్ తర్వాత.. ఏడాదికి 15 రోజులు వర్క్​ ఫ్రం హోం!

లాక్ డౌన్ తర్వాత.. ఏడాదికి 15 రోజులు వర్క్​ ఫ్రం హోం!
  • లాక్​డౌన్​ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాన్స్ 
  • అర్హత కలిగిన వారికి మాత్రమే.. 
  • క్లాసిఫైడ్​ ఫైళ్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు 
  • డ్రాఫ్ట్​ గైడ్​లైన్స్​ను సిద్ధం చేసిన డీవోపీటీ 
  • ఈ నెల 21లోగా డ్రాఫ్ట్​పై సూచనలు ఇవ్వాలని ఆదేశం

న్యూఢిల్లీ: లాక్​డౌన్​ ముగిసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం కొనసాగించాలని మోడీ సర్కారు భావిస్తోంది. ఏడాదికి 15 రోజుల చొప్పున అర్హత కలిగిన ఆఫీసర్లు/స్టాఫ్​కు ఈ ఆప్షన్​ను ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు వర్క్​ఫ్రం హోంకు సంబంధించిన డ్రాఫ్ట్​ గైడ్​ లైన్స్​ ను డిపార్ట్​మెంట్​ ఆఫ్ పెర్సనల్​ అండ్​ ట్రైనింగ్(డీవోపీటీ) సిద్ధం చేసింది. డ్రాఫ్ట్​ గైడ్​లైన్స్​పై ఈ నెల 21 లోగా తమ స్పందన తెలియజేయాలని అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది. ఎవరైనా స్పందించకపోతే డ్రాఫ్ట్​ గైడ్​లైన్స్​ను ఆ శాఖలు ఆమోదించినట్టు భావిస్తామని స్పష్టం చేసింది.

మెజారిటీ డిపార్ట్​మెంట్లలో వర్క్ ​ఫ్రం హోం

ప్రస్తుతం 48.34 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా అన్ని డిపార్ట్​మెంట్స్​లో సోషల్​ డిస్టెన్స్​ పాటించేందుకు వర్క్​ ఫ్రం హోం తప్పనిసరైందని డీవోపీటీ పేర్కొంది. ‘‘కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్​మెంట్స్​ కరోనాపై పోరాటంలో పోరాటం చేస్తున్నాయి. లాక్​డౌన్​ పిరియడ్​లో నేషనల్​ ఇన్ఫర్మాటిక్స్​ సెంటర్(ఎన్ఐసీ) కల్పిస్తున్న ఈ–ఆఫీస్, వీడియో కాన్ఫరెన్స్​ సౌకర్యాలను సక్సెస్​ఫుల్​గా వాడుకుంటున్నాయి” అని చెప్పింది. భవిష్యత్తులో పని చేసే చోట ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించేందుకు దఫదఫాలుగా హాజరు, షిఫ్ట్​ లను అమలుకు సెంట్రల్ సెక్రటేరియట్​ సన్నాహాలు చేస్తోందని తెలిపింది. లాక్​ డౌన్​ ముగిసిన తర్వాత వర్క్​ఫ్రం హోం అమలుకు సంబంధించి స్టాండర్డ్​ ఆపరేటింగ్​ ప్రొసిజర్(ఎస్ వోపీ) ఫ్రేం వర్క్​ను సిద్ధం చేయాల్సి ఉందని పేర్కొంది.

డ్రాఫ్ట్​ గైడ్​లైన్స్​లో కొన్ని..

  • ఉద్యోగులు స్మూత్​గా, ఇబ్బందులు లేకుండా పనిచేసేందుకు వీలుగా కొత్త స్టాండర్డ్​ ఆపరేటింగ్​ ప్రొసిజర్​ను ఫైనల్​ చేయాల్సి ఉంది.
  • ఉద్యోగులకు సంబంధిత శాఖలు/డిపార్ట్​మెంట్లు ల్యాప్​టాప్/డెస్క్​టాప్​ అందించాలి. రొటేషన్​ బేసిస్​లో ల్యాప్​టాప్​లను అందజేయాలి. వర్క్​ఫ్రం హోంలో ఇతర లాజిస్టిక్​ సపోర్ట్​ను కూడా అందించాలి.
  • వర్క్​ఫ్రం హోం కోసం ఇంటర్నెట్​ సర్వీసులను వాడుకున్నందుకు రీయింబర్స్​మెంట్​ చేయాలి. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక గైడ్​లైన్స్​ను జారీ చేయాలి.
  • వీఐపీ, పార్లమెంట్​ మ్యాటర్లకు సంబంధించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందు కోసం ప్రత్యేక ప్రొటోకాల్​ను ఫాలో కావాలి.
  • వేరే అధికారి దగ్గరకు ఫైల్​ చేరిందా లేదా అనే విషయం తెలిసేలా ఎస్ఎంఎస్​లు పంపాలి.
  • ఇప్పటి వరకూ ఈ–ఆఫీస్​ మాడ్యూల్​వాడని మినిస్ట్రీలు/డిపార్ట్​మెంట్లు.. తమ సెక్రటేరియట్లలో నిర్దిష్ట సమయంలో దానిని అమలులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి.
  • ఈ–ఆఫీస్​ అంటే ఆఫీస్​ వర్క్​ను డిజిటైజ్/కంప్యూటరైజ్​​చేయడం అన్నమాట. ప్రస్తుతం 75 మినిస్ట్రీలు/డిపార్ట్​మెంట్లు ఈ ఆఫీస్​ ప్లాట్​ఫాంను వాడుతున్నాయి. 57 డిపార్ట్​మెంట్లు 80 శాతం పనిని దీని ద్వారానే చేస్తున్నాయి.
  • ఈ–ఆఫీస్​ ను వాడి వర్క్​ఫ్రం హోం ద్వారా క్లాసిఫైడ్​ ఫైల్స్/పేపర్లకు సంబంధించిన వ్యవహారాలను చేయడానికి వీలు లేదు.
  • హోం శాఖతో సంప్రదించిన తర్వాత ఎన్​ఐసీ ఈ ఆఫీస్​ ద్వారా క్లాసిఫైడ్​ ఇన్ఫర్మేషన్/ఫైల్స్​ ను యాక్సెస్​ చేయడానికి అవసరమైన గైడ్​లైన్స్​ను, స్టాండర్డ్​ ఆపరేటింగ్​ ప్రొసీజర్​ను ప్రతిపాదిస్తుంది. సెంట్రల్​ సెక్రటేరియట్​ మాన్యువల్​ ఆఫ్​ ఆఫీస్​ ప్రొసిజర్(సీఎస్​ఎంవోపీ) నిర్దేశించిన స్టాండ్‌‌లోన్​ కంప్యూటర్లలోనే క్లాసిఫైడ్​ ఫైళ్లను యాక్సెస్​ చేయడానికి వీలవుతుంది.
  • ఆఫీసర్లకు ఇచ్చే ల్యాప్​టాప్​లలో అఫీషియల్​ వర్క్​ మాత్రమే చేయాలి. సొంత పనులకు వాడుకోకూడదు. ఈ డివైజ్​లు మాల్​వేర్, మాలిసియస్​ వెబ్​సైట్ల బారిన పడకుండా అవసరమైన ప్రొటెక్షన్​ చర్యలను ఎన్​ఐసీ చూసుకుంటుంది.
  • పర్సనల్​ కంప్యూటర్లు/ల్యాప్​టాప్​లపై పనిచేసే వారు తప్పనిసరిగా రెగ్యులర్​ అప్​డేట్లను, యాంటి వైరస్​ స్కాన్లను చేయడం, మాలిసియస్​ సైట్లను బ్లాక్​ చేయడం చేయాలి. ఎన్​ఐసీ సాయంతో తమ డివైజ్​లోని సమాచారం చోరీ జరక్కుండా సేఫ్టీ మెజర్స్​ తీసుకోవాలి.
  •  వర్క్​ఫ్రం హోం చేసే అధికారులు పైఆఫీసర్ల డైరెక్షన్లు, సూచనల కోసం ఫోన్​లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి.
  • వివిధ శాఖల మధ్య సంప్రదింపులు, ఫైళ్ల మార్పిడి ఈఆఫీస్​ ద్వారా సీమ్​లెస్​గా జరగాలి.
  • వర్క్​ఫ్రం హోం చేసే సమయంలో ఇంపార్టెంట్​ మీటింగ్​లకు అటెండ్​ కావడానికి ఎన్​ఐసీ వీడియో కాన్ఫరెన్సింగ్​ ఫెసిలిటీని వాడుకోవాలి. ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించేందుకు, ఆఫీస్​ ఎన్విరాన్​మెంట్​లో ఉన్నట్టుగా పని చేసేందుకు ఈ వీడియో కాన్ఫరెన్స్​ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలి.

రైల్వేస్‌ కు రూ.45 కోట్ల ఆదాయం