కోదాడ, వెలుగు: చిలుకూరు మండలంలోని కొమ్ముబండ తండా సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. ఈ గ్రామం ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా నూనావత్ రాజ్యలక్ష్మి, మాలోతు విజయలక్ష్మి నామినేషన్ వేశారు. అయితే రాజ్యలక్ష్మి పుట్టుకతో బీసీ కాగా.. ఎస్టీ వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్నారు. ఆమెకు ఎస్టీ సర్టిఫికెట్ జారీ చేయడంపై అధికారులకు ఫిర్యాదు అందింది.
స్పందించిన కోదాడ ఆర్డీవో విచారణకు ఆదేశించి, నివేదికను కలెక్టర్ తేజస్నంద్లాల్పవార్కు అందజేయగా.. ఆయన ఎస్టీ సర్టిఫికెట్రద్దు చేశారు. దీంతో విజయలక్ష్మి ఎన్నిక ఏకగ్రీవమైంది.
