నిజాం కాలేజీ లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నిజాం కాలేజీ లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్, వెలుగు: ఎలక్షన్ డ్యూటీలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్​లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం కాలేజీ గ్రౌండ్ ను సికింద్రాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్​పాటిల్ హేమంత్ కేశవ్ తో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్​అనుదీప్ మాట్లాడుతూ.. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్​సభ, కంటోన్మెంట్​అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల డ్యూటీ చేసే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మే 7 నుంచి12వరకు రిసెప్షన్ సెంటర్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు(ఆర్సీడీసీ) సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మొత్తం30 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పీడబ్ల్యూడీ వారు 2వ గేట్, మిగిలిన అధికారులు గేట్ నంబర్ 4 ద్వారా కేంద్రాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భోజన, తాగునీరు, టాయిలెట్ల వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, ఆర్డీఓ కె.మహిపాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, నాంపల్లి తహసీల్దార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాములు, పోలీస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.