- కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా రెండో, మూడవ విడతలలో విధులు నిర్వర్తించనున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ ఓ ప్రకటనలో కోరారు.
రెండో విడత అనంతగిరి, చిలుకూరు, చివ్వెంల, కోదాడ, మోతే, మునగాల, నడిగూడెం, పెన్ పహాడ్ మండలాలలో ఎన్నికలు జరగనున్నాయని, ఇందుకు సంబంధించి అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు ఈ నెల 7 నుంచి 10 వరకు ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. మూడవ విడత ఎన్నికలు జరిగే మండలాలలో ఉద్యోగులు ఈ నెల 10,12,13,15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలన్నారు.

