హిరణ్య కశ్యప గా రానా పోస్టర్.. డైరెక్టర్ గుణశేఖర్ కౌంటర్

హిరణ్య కశ్యప గా రానా పోస్టర్.. డైరెక్టర్ గుణశేఖర్ కౌంటర్

టాలీవుడ్ మోస్ట్ వర్సటిలిటీ యాక్టర్ రానా దగ్గుబాటి( Rana Daggubati) ..మొదటి నుంచి కథ ప్రాధాన్యం ఉన్న మూవీస్ ను ఎంచుకుంటూ తనలోని యాక్టర్ ను బయటికి వచ్చేలా చేస్తున్నారు. తాజాగా రిలీజైన హిరణ్య కశ్యప(Hiranyakashyapa) మూవీ పోస్టర్ లో రానా విభిన్నమైన అవతారంలో కనిపిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) ఈ మూవీకు కథను అందిస్తుండగా..రానా,స్పిరిట్ మీడియా సంయుక్తంగా భారీ స్థాయిలో  నిర్మించనున్నారు. 

హిరణ్య కశ్యప మూవీని అమర చిత్ర కథ కామిక్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్ లో తెలిపారు. రాక్షస రాజు గా కనిపిస్తున్న రానా లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు ..అయితే ఇదే విషయంపై డైరెక్టర్  గుణశేఖర్ ట్విట్టర్ లో తనదైన రీతిలో స్పందించారు..

'దేవుడిని మీ కథకు కేంద్ర ఇతివృత్తంగా చేస్తున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది' అని గుణశేఖర్ ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు.

మొదట హిరణ్య కశ్యప మూవీని గుణశేఖర్ తెరపైకి తీసుకురావాలని ఎప్పటి నుంచో కథ ప్రయత్నాలు చేస్తున్నారు. రానా.. గుణశేఖర్ మధ్య ఈ ప్రాజెక్ట్ కు సంభందించిన చర్చలు కూడా జరిగిన విషయం తెలిసిందే. కానీ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో గుణశేఖర్ పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు అంటున్నారు సినీ క్రిటిక్స్. రీసెంట్ గా గుణశేర్ డైరెక్టర్ గా సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం మూవీ భారీ డిజాస్టర్ కావడమే అంటున్నారు.

ఇక ఈ హిరణ్య కశ్యప మూవీని డైరెక్ట్ చేసే దర్శకుడు ఎవరు అనేది త్వరలో తెలిసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం రానా ప్రాజెక్ట్ K కామిక్-కాన్ ఈవెంట్ కోసం శాన్ డియాగోలో ఉన్నారు.