బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి.. పోస్టర్ల కలకలం

బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి.. పోస్టర్ల కలకలం

హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం రేపాయి. సుధీర్ రెడ్డిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటూ రోడ్డుకు ఇరువైపులా పోస్టర్లు అంటించారు. గతంలో ప్రముఖులపై దాడి చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డీ అంటూ.. ఎమ్మెల్యేపై ఎందుకు రౌడీషీట్ ఓపెన్ చేయలేదంటూ పోస్టర్లలో ప్రశ్నించారు.

ఇలాంటి రౌడీ రాజ్యంపై తాను కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర గవర్నర్ కి ఫిర్యాదు చేయబోతున్నాను. కాబట్టి మీరు నాతో కలసి వచ్చే వాళ్లు రావాలని ఫోన్ 8978796777 రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లు చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి రిలీజ్ చేసినట్లుగా పోస్టర్లలో ఫోటో, ఫోన్ నెంబర్ ను కూడా జతచేశారు. 

పోస్టర్లలో ఏముందంటే..

* సుధీర్ రెడ్డిపై రౌడీ షీట్ తెరవాలి
* సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళమీద తన గుండాలతో దాడులకు దిగుతాడు అందులో కొందరి ప్రముఖులు వీళ్లు... వారి ఫోటోలు ఇచ్చారు.
* 100 రోజుల్లో 5 భౌతిక దాడులు
* ఇలాంటి రౌడీ రాజ్యంపై నేను కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ కి పిటిషన్ ఇవ్వబోతున్నాను..

* మీరు కలిసి రావాలి అనుకుంటే ఈ కింది నెంబర్ కి తెలియచేయగలరు.
   8978796777
* వంగా మధుసూదన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్, ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం.