30, 31న ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్

30, 31న ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్

హైదరాబాద్, వెలుగు :  భారీ వర్షాలతో వాయిదాపడ్డ టీఎస్​ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్, టీఎస్​ఈసెట్​, పీజీఈసెట్​ తేదీలను వెల్లడించింది. 30, 31వ తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్ నిర్వహిస్తామని కౌన్సిల్ చైర్మన్ ప్రొ. లింబాద్రి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల ఎగ్జామ్​ నిర్వహిస్తామని చెప్పారు. టీఎస్ ఈసెట్ ఎగ్జామ్​ను ఆగస్టు 1న రెండు సెషన్స్​లో జరుపుతామని వెల్లడించారు. 

ఆగస్టు 2 నుంచి పీజీ ఈసెట్ 

పీజీ ఈసెట్ తేదీల్లోనూ మార్పులు చేశారు. గతంలో 29 నుంచి ఆగస్టు 1 వరకు జరగాల్సిన పరీక్షలను, ఆగస్టు 2 నుంచి 5 వరకు నిర్వహిస్తామని ప్రొ.లింబాద్రి తెలిపారు. హాల్​టికెట్లను త్వరలోనే వెబ్ సైట్​లో పెడ్తామని పేర్కొన్నారు.

రేపటి నుంచి టీఎస్‌‌‌‌‌‌‌‌ లాసెట్‌‌‌‌‌‌‌‌, పీజీ ఎల్‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌

రాష్ట్రంలో లాసెట్, పీజీఎల్​సెట్ ఎగ్జామ్స్ ను 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్​లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ.రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం 2సెషన్లు, శుక్రవారం ఒక సెషన్ ఎగ్జామ్ జరుగుతుందని చెప్పారు. మొత్తం 42 పరీక్షా కేంద్రాల్లో 35,538 మంది పరీక్షలకు అటెండ్ అవుతారని వెల్లడించారు. మూడేండ్ల ఎల్ఎల్బీ కోర్సు కోసం 24,938 మంది.. ఐదేండ్ల ఎల్ఎల్బీ కోర్సు కోసం 7,507 మంది.. ఎల్ఎల్ఎం కోసం 3,093 మంది పరీక్ష రాయనున్నట్లు వివరించారు.   

ఇయ్యాల్టి నుంచి పాలిసెట్ వెబ్ ఆప్షన్లు  

పాలిటెక్నికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం వెబ్ఆప్షన్ల ప్రక్రియను బుధవారం నుంచి ప్రారంభిస్తామని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 25 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ 22 వరకు ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 113 కాలేజీల్లో 26,822 సీట్లున్నట్టు వెల్లడించారు. 54 గవర్నమెంట్  కాలేజీల్లో 11,892 సీట్లు.. 58 ప్రైవేటు కాలేజీల్లో 14,700 సీట్లు.. ఒక ఎయిడెడ్ కాలేజీలో 230 సీట్లున్నాయని తెలిపారు. 27న ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ఉంటుందని పేర్కొన్నారు.