సీఎం జైరాం ఠాకూర్ నిరుద్యోగులను మోసం చేసిన్రు: ప్రియాంక

సీఎం జైరాం ఠాకూర్ నిరుద్యోగులను మోసం చేసిన్రు: ప్రియాంక

నిరుద్యోగులకు జాబ్స్ ఇచ్చే ఉద్దేశం బీజేపీకి లేదని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ ఆరోపించారు.  రాష్ట్రంలో 63 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని..వాటిని భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంకా గాంధీ.. బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అదుపులో లేకపోవడంతో నిత్యావసర ధరలు పెరిగిపోయాయని మండిపడ్డారు. 

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. కానీ వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని ప్రియాంక గాంధీ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని..బీజేపీకి ఓటు అనే ఆయుధంతో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులను నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పారు.

ఇక మంచురాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వరుస సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలపై హామీలు గుప్పిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.