ఆలూతో పాలు

ఆలూతో పాలు

మామూలుగా అయితే ఆలుతో కర్రీ, లేదా చిప్స్‌‌, సమోసా, టిక్కా, నగ్గెట్స్‌‌, ఫ్రెంచ్‌‌ ఫ్రైస్‌‌ చేసుకుంటారు. ఇవే కాకుండా పొటాటోతో మిల్క్‌‌ కూడా చేయొచ్చు తెలుసా! ఈ మధ్యనే సోయా మిల్క్‌‌, ఆల్మండ్‌‌ మిల్క్‌‌, ఓట్‌‌ మిల్క్‌‌, బఠాని మిల్క్‌‌ వచ్చాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌‌లో పొటాటో మిల్క్‌‌ కూడా చేరింది. ఈ పాలలో లో షుగర్‌‌‌‌, సాచ్యురేటెడ్‌‌ ఫ్యాట్‌‌ ఉన్నాయట. బ్రిటన్‌‌కు చెందిన డగ్ అనే కంపెనీ పొటాటో మిల్క్‌‌ను తయారుచేసి మార్కెట్‌‌లోకి తెచ్చింది. మామూలు పాలలానే చిక్కగా, టేస్టీగా ఉండే ఈ పాలు  కాపచినో కాఫీ తయారికి బాగుంటాయట. అయితే, ఈ పాలు తాగినవాళ్లు కాస్త ఉప్పగా ఉన్నాయని చెప్తున్నారు.

ఈ పాలలో ఎన్నో రకాల విటమిన్లు  ఉన్నాయి. మాల్టో డెక్స్ర్టిన్‌‌, ప్రి ప్రొటీన్‌‌, ఫైబర్‌‌‌‌, సుక్రోజ్​తో పాటు  చాలా రకాల విటమిన్లు ఉన్నాయి. మామూలు పాలలో లాక్టోజ్‌‌ ఉండటం వల్ల కొంత మందికి అవి జీర్ణం కావు. పొటాటో పాలలో లాక్టోజ్‌‌ లేదు, అందుకని ఈ ప్రాబ్లమ్‌‌ ఉన్నవాళ్లు హ్యాపీగా తాగొచ్చు. పొటాటో పాల రేటు బాదం, సోయా పాల కంటే తక్కువ. లీటర్‌‌‌‌ పొటాటో మిల్క్‌‌ 170 రూపాయలే. ఈ పాలలో రోజూ శరీరానికి కావల్సిన 15% క్యాల్షియం, విటమిన్‌‌– డి, రిబోఫ్లేవిన్‌‌, విటమిన్‌‌– బి12 ఉంటాయి. అంతేకాకుండా 39 క్యాలరీలు, 1.5 గ్రాముల ఫ్యాట్‌‌ ఉంటుంది. సోయా పాలకన్నా వీటిలోనే ఎక్కువ ప్రొటీన్‌‌లు ఉన్నాయట. సోయా, ఓట్స్‌‌తో  పోలిస్తే పొటాటో సాగుకు తక్కువ ప్లేస్‌‌, తక్కువ వాటర్‌‌‌‌ అవసరం. ఈజీగా పండించొచ్చు అంటోంది డగ్‌‌ కంపెనీ. బ్రిటన్‌‌లో ప్లాంట్‌‌ బేస్డ్‌‌ మిల్క్‌‌ వాల్యూ  మొత్తం 2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే 2019తో పోలిస్తే ఇప్పుడు 10% ప్లాంట్‌‌ బేస్డ్‌‌ మిల్క్‌‌ వాడకం పెరిగింది అంటోంది డగ్ కంపెనీ. అందుకే రాబోయే రోజుల్లో యూరప్‌‌, చైనా, అమెరికా దేశా ల్లో పొటాటో మిల్క్‌‌ ప్రొడక్షన్‌‌ చేస్తామని  చెప్పింది. డైరీ ప్రొడక్ట్స్‌‌ పడని వాళ్లకు ఆలు పాలు ఒకరకంగా బెటర్‌‌‌‌ ఆప్షన్‌‌ అంటోంది ఆ కంపెనీ.