మానకొండూరు నిధుల మళ్లింపు హామీపై సీఈసీకి ఫిర్యాదు

మానకొండూరు నిధుల మళ్లింపు హామీపై సీఈసీకి ఫిర్యాదు

కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) వికాస్ రాజ్ కు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మానకొండూరు నియోజకవర్గానికి చెందిన రూ.2 కోట్ల నిధులను మునుగోడులో ఖర్చు చేసి అభివృద్ధి చేస్తానంటూ రసమయి ఇచ్చిన హామీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

గత నెల 20న మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం దోనిపాముల గ్రామంలో జరిగిన ధూంధాంలో తన నియోజకవర్గ నిధులను దోనిపాముల కోసం వెచ్చిస్తానంటూ రసమయి హామీ ఇచ్చారని రాజశేఖర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధమైన ఈ హామీపై స్పందించి రసమయిపై చర్యలు తీసుకోవాలని కోరారు.