గుంతల రోడ్డు బాగు చేయరూ?

గుంతల రోడ్డు బాగు చేయరూ?

కామారెడ్డి జిల్లా : పిట్లం, మద్దెల చెరువు వరకు 15 కిలోమీటర్ల రోడ్డును ఆరేళ్ల క్రితం రెండు వరసలుగా విస్తరించారు. మధ్యలో మూడు కిలోమీటర్లు అటవీ అనుమతులు లేవంటూ వదిలేశారు. కాగా ఈ రోడ్డును పట్టించుకోకపోవడంతో రోడ్డంతా గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  వర్షాలు కురుస్తుండడంతో మూడు కిలోమీటర్ల రోడ్డు, ఆరేళ్ల క్రితం వేసిన రెండు వరసల దారి పూర్తిగా గుంతలమయంగా మారింది. కనీసం  తాత్కాలిక మరమ్మతులు అయినా  చేయాలని వాహనదారులు కోరుతున్నారు. - పిట్లం, వెలుగు