అర్హులకే పరిహారం ఇవ్వాలంటూ పోతులబోగుడ రైతుల ఆందోళన

అర్హులకే పరిహారం ఇవ్వాలంటూ పోతులబోగుడ రైతుల ఆందోళన

శివ్వంపేట, వెలుగు : ట్రిపుల్​ఆర్ ​రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయే అసలైన రైతులకే పరిహారం ఇవ్వాలంటూ మంగళవారం మెదక్​జిల్లా శివ్వంపేట తహసీల్దార్​ఆఫీస్ ​ముందు పోతులబోగుడ రైతులు ఆందోళన చేశారు. రెవెన్యూ అధికారులు మంగళవారం ట్రిపుల్ ​ఆర్​రోడ్డులో భూములు కోల్పోతున్న గ్రామ రైతులతో తహసీల్దార్ ​ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 44 ఎకరాల్లో 53 మంది రైతులు కబ్జాలో ఉండగా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం వేరే రైతుల పేర్లు ఉన్నాయని ఆరోపించారు.

అధికారులు చేసిన తప్పిదం వల్ల సర్వే నంబర్​ ఒక దగ్గర, భూములు ఒక దగ్గర ఉన్నాయన్నారు. భూములు లేని వారికి పాస్​బుక్స్​ ఇచ్చారని, వారికి రైతుబంధు కూడా వస్తోందన్నారు. ఇప్పుడు రికార్డులో ఎవరి పేరుంటే వారికే పరిహారం వస్తుందని అధికారులు అనడం కరెక్ట్​కాదన్నారు. ఫీల్డ్​లో సర్వే నిర్వహించి కాస్తులో ఉన్న అసలైన రైతులకే నష్టపరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని తేల్చి చెప్పారు.