V6 News

భద్రకాళి అమ్మవారికి కుమ్మరుల పట్టువస్త్రాలు 

భద్రకాళి అమ్మవారికి కుమ్మరుల పట్టువస్త్రాలు 

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లు భద్రకాళి అమ్మవారికి కుమ్మర కులస్తులు కోలాట నృత్యాలు, డప్పు చప్పుళ్లతో  ర్యాలీగా తరలొచ్చి పట్టువస్త్రాలు, పూలుపండ్లు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వసంతోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అమంచి నాగపరిమళ, శ్రీనివాసరావు దంపతులు కులస్తులతో కలిసి మొక్కులు చెల్లించుకుని అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.

అనంతరం మహాన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో కుమ్మర సంఘం ప్రతినిధులు ఆవునూరి రామ్మూర్తి, కుమ్మరి బాలకృష్ణ, మిడిదొడ్డి శివానందం, చిలువేరు శంకర్‍, అమంచి అనిల్‍ కార్తీక్‍, రాజేశ్వరి, ధర్మరాజు, వందన, రుద్రారపు కుమారస్వామి, కందికొండ వేణు, నేదునూరి రాజేందర్‍, డాక్టర్‍ రాజ్‍గోపాల్‍, నాంపల్లి ప్రభాకర్‍, ఇజ్జగిరి రమేశ్‍మూర్తి, ఇజ్జగిరి రంజిత్‍, శంకర్‍, చంద్రమౌళి, అశోక్‍ తదితరులు పాల్గొన్నారు.