దేశం​లో 12.3 శాతం తగ్గిన పేదరికం

దేశం​లో 12.3 శాతం తగ్గిన పేదరికం

దేశంలో పేదరిక అంచనాలపై ప్రపంచ బ్యాంక్​ నివేదికను విడుదల చేసింది. ఆర్థికవేత్తలు సుతీర్థ సిన్హారాయ్​, రాయ్​ వాన్​ డెర్​ వీడ్​ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించారు. 

  • ఈ నివేదిక ప్రకారం దేశం​లో పేదరికం 12.3శాతం తగ్గింది. 2011తో పోల్చితే 2019లో పేదరికం పరిస్థితి మెరుగుపడిందని చెప్పింది. 2011లో 22.5శాతం ఉన్న పేదరికం 2019లో 10.2శాతానికి పడిపోయిందని వివరించింది. 
  • గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం గణనీయంగా తగ్గింది. 2011లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 26.3శాతం ఉండగా 2‌‌‌‌019 నాటికి అది 11.6 శాతానికి దిగజారింది. అలాగే అదే కాలంలో పట్టణ ప్రాంతాల్లో పేదరికం 14.2శాతం నుంచి 6.3శాతానికి తగ్గింది. 2011–19లో గ్రామీణ, పట్టణ పేదరికం వరుసగా 14.7శాతం, 7.9శాతం తగ్గాయని ఆ నివేదిక పేర్కొంది. 
  • గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్ధారించడానికి రోజూ ఒక మనిషి 35 రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తే అతడు పేదవాడిగా నిర్ధారించబడుతారని నిపుణులు, ప్రభుత్వాలు నిర్ణయించాయి. గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు ఉన్న కుటుంబానికి రోజుకు 140 రూపాయల ఆదాయం ఉంటే చాలు, పట్టణాల్లో నలుగురికి కలిపి 168 రూపాయలుంటే చాలు. దీన్ని వినిమయ ఖర్చు సూచిక అంటారు.