అలర్ట్: హైదరాబాద్ లో ఇవాళ పవర్ ​కట్

అలర్ట్: హైదరాబాద్ లో ఇవాళ  పవర్ ​కట్

హైదరాబాద్, వెలుగు : వర్షాలు, ఈదురు గాలులకు కూలిన చెట్ల కొమ్మలు తొలగింపు పనుల కారణంగా మంగళవారం సిటీలోని పలు ప్రాంతాల్లో పవర్​కట్​ఉంటుందని విద్యుత్​శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అబిడ్స్​లోని లిటిల్​ఫ్లవర్​స్కూల్​ఫీడర్​పరిధిలోని లిటిల్​ఫ్లవర్ స్కూల్, డైరెక్టర్​ఆఫ్​ఫైనాన్స్, సుజాతా స్కూల్​, చెర్మాస్​హౌస్, మెడ్విన్​హాస్పిటల్, చాపెల్​రోడ్ లోని విజయాబ్యాంక్, మహేశ్​నగర్​ ప్రాంతాల్లో కరెంట్​సప్లయ్​ఉండదని చెప్పారు.

మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు బాబుఖాన్​ఎస్టేట్​ఫీడర్​ పరిధిలోని బాబుఖాన్​ఎస్టేట్, ఎల్బీస్టేడియం రోడ్, హెచ్ పీ పెట్రోల్ బంక్, పోలీస్​కమిషనర్ ఆఫీస్, నిజాం హాస్టల్, జగదాంబ జ్యువెలరీ బిల్డింగ్ ప్రాంతాల్లో కరెంట్​సప్లయ్​నిలిపివేస్తామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 వరకు ఏపీ టూరిజం ఫీడర్​పరిధిలోని అంబేద్కర్​స్టాచ్యూ, టాంక్​బండ్, లిబర్టీ పెట్రోల్​బంక్, ఆయిల్​ సీడ్స్​క్వార్టర్స్, స్టాంజా బిల్డింగ్, దాదూస్వీట్ షాప్​ఏరియాల్లో విద్యుత్​సరఫరా ఉండదని అధికారులు స్పష్టం చేశారు.