మర మగ్గాలపై నేసిన వస్త్రాలను.. చేనేత పేరుతో అమ్మేస్తున్నారు

మర మగ్గాలపై నేసిన వస్త్రాలను.. చేనేత పేరుతో అమ్మేస్తున్నారు

మర మగ్గాలపై నేసిన వస్ర్తాలను చేనేత వస్ర్తాలని చెబుతూ హైదరాబాద్‌‌లోని బడా షాపింగ్‌‌ మాల్స్‌‌ కస్టమర్లను మోసం చేస్తున్నాయని నేతన్నల జేఏసీ చైర్మన్ దాసు సురేశ్ ఆరోపించారు.ఈమేరకు శుక్రవారం రీజినల్ డిప్యూటీ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టర్‌‌‌‌ త్రిమూర్తి కుమార్‌‌‌‌కు ఆయన ఫిర్యాదు చేశారు. తర్వాత సురేశ్ మాట్లాడుతూ..హైదరాబాద్‌‌లో చేనేత వస్తువులుగా అమ్ముతున్నవాటిలో 80 నుంచి 90% మరమగ్గాలపైనేసినవేనన్నారు. సినీ ప్రముఖులు, హీరో, హీరోయిన్లు ఇవేమి పట్టకుండా చేనేత వస్ర్తాలని అసత్య ప్రచారంచేస్తున్నారని, ఇదిలాగే కొనసాగితే కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రం లో రూ.వేల కోట్లలో మోసపూరిత వ్యాపారం కొనసాగుతోందని ఆరోపించారు. పక్క రాష్ట్రాల నుంచి సిల్క్ ఇమిటేషన్ వస్త్రాలు పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. దీంతో నేతన్నలు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను ఇప్పటికే పలుమార్లు హ్యాండ్లూమ్ అండ్ టెక్స్​టై ల్ కమిషనర్ శైలజా రామయ్యర్ దృష్టికి తీ సుకెళ్లామని, హైకోర్ట్​లోనూ కార్మికుల పక్షాన పిల్ దాఖలు చేశామని చెప్పా రు. నేతన్నల సమస్యల శాశ్వత పరిష్కారానికి డిసెంబర్ 2న చలో ఢిల్లీ చేపట్టనున్నట్టు సురేశ్ వెల్లడించారు.