సగానికి పడిపోయిన కరెంట్ డిమాండ్

సగానికి పడిపోయిన కరెంట్ డిమాండ్

బోరింగ్ లు, లిఫ్ట్ లు ఆపేయటంతో తగ్గిన వాడకం

వానలు, వరదల ఎఫెక్ట్

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో కరెంట్ వాడకం ఒక్కసారిగా తగ్గిపోయింది. వరుసగా వానలు పడుతుండటంతో డ్యామ్ లు, పంట చేల్లోకి భారీగా నీళ్లు వచ్చాయి. దీంతో బోర్లు, లిఫ్ట్ ల కోసం వాడే కరెంట్ ఆదా అవుతోంది. జులై 28 నాటికి ఉన్న డిమాండ్ తో పోల్చితే దాదాపు సగానికి పైగా డిమాండ్ పడిపోయింది. ఈ నెల 16 న 5, 611, 17న 5, 991 మెగావాట్లు మాత్రమే వినియోగమైంది. జులై 28 నాటికి రాష్ట్రం లో 11, 177 మెగావాట్ల వాడకం ఉండగా, ఆగస్టు 9 నాటికి 12, 908 మెగావాట్ల దాకా డిమాండ్ పెరిగింది.

కాళేశ్వరం లిప్టులు కన్నేపల్లి, అన్నారం, సుందిళ్ల, నందిమేడారం, లక్ష్మీపూర్‌ పంప్ హౌస్ లను రన్ చేయటంతో కరెంట్ వాడకం రికార్డ్ స్థాయికి చేరింది. 13 వ తేదీ నుంచి వర్షాల ఎఫెక్ట్ తో బోర్లు, పంపు హౌస్ లను పూర్తిగా బంద్ పెట్టటంతో కరెంట్ వాడకం తగ్గింది. ఒక్కసారిగా డిమాండ్ పడిపోవటంతో గ్రిడ్ పై ఎఫెక్ట్ పడకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం రోజుకు 6 వేల మెగావాట్ల డిమాండ్ ఉంటోందన్నారు.