ఓ వైపు భారీ వాన..మరోవైపు చిమ్మ చీకట్లు..విరిగిపడిన రేకులు..కరెంట్ స్థంభాలు, చెట్లు...భయం భయంగా బతుకు. ఇది రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జనాల పరిస్థితి. వాన బీభత్సంతో ప్రజలు బిక్కు బిక్కు మంటూ బతికారు. వడగండ్ల వానతో స్థంభాలు విరిగిపడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లోనే గడిపారు. రంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది.
రంగారెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ లో అకాల వర్షం ఆగమాగం చేసింది. ఈదురుగాలులతో కూడిన వానలకు విద్యుత్ స్తంబాలు,చెట్లు నేలకొరిగాయి. భారీ హోర్డింగ్ లు కూలిపోయాయి. వడగండ్ల వానకు పంటపొలాలు దెబ్బతిన్నాయి.
అబ్దుల్లాపూర్ మెట్టు లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రక్షణగోడ కూలిపోయింది. విద్యుత్ స్తంభాలపై పడ్డ వెంచర్ రేకులు పడ్డాయి. స్థంభాలు కూలి ఇండ్లపై కరెంట్ వైర్లు పడటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి.