నవంబర్ 26న హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో నీళ్లు బంద్

నవంబర్ 26న  హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో  నీళ్లు బంద్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మహానగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3 పంపింగ్ స్టేషన్లకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసే బల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న కరెంట్ ట్రాన్స్​ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చేందుకు ఎస్పీడీసీఎల్ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో పంపింగ్ స్టేషన్లకు బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఈ కారణంగా కృష్ణా ఫేజ్-1, 2 , 3 ద్వారా నీరు అందే ప్రాంతాలకు బుధవారం మంచినీటి సరఫరా ఉండదని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు అధికారులు తెలిపారు.

నీటి సరఫరా ఉండని ప్రాంతాలు: చార్మినార్, వినయ్​నగర్, బోజగుట్ట, రెడ్​హిల్స్, నారాయణగూడ, ఎస్​ఆర్ నగర్, మారేడ్​పల్లి, రియాసత్‌‌ నగర్, కూకట్‌‌పల్లి, సాహెబ్‌‌ నగర్, హయత్​నగర్, సైనిక్​పురి, ఉప్పల్, హఫీజ్​పేట, రాజేంద్రనగర్, మణికొండ, బోడుప్పల్, మీర్​పేట.