అభిమానుల కోసం 60 థియేటర్లలో 'ఆదిపురుష్' త్రీడీ టీజర్‌

అభిమానుల కోసం 60 థియేటర్లలో 'ఆదిపురుష్' త్రీడీ టీజర్‌

ఆదిపురుష్ టీజర్‌ని త్రీడీలో చూసి చిన్నపిల్లాడిలా ఫీల్ అయ్యానని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్నాడు. మూవీ త్రీడీ టీజర్‌ ని హైదరాబాద్ లోని ఏఎంబీ థియేటర్లో రిలీజ్ చేశారు. టీజర్ ను చూసిన అనంతరం ప్రభాస్ మీడియాతో  మాట్లాడాడు. " నేను ఫస్ట్ టైమ్ చూసి చిన్నపిల్లాడిగా అయిపోయాను.  శుక్రవారం అభిమానుల కోసం 60 థియేటర్లలో త్రీడీ టీజర్‌ని ప్రదర్శిస్తాం. ఇది థియేటర్ కోసం తీసిన సినిమా. మీ అందరి అభిమానం, ఆశీస్సులు మాకు కావాలి. రానున్న 10 రోజుల్లో మరింత మంచి కంటెంట్ తో మీ ముందుకి వస్తున్నాం" అని  ప్రభాస్ చెప్పాడు. 

టీజర్ నాకు చాలా బాగా నచ్చింది : దిల్ రాజు  

ఆదిపురుష్ టీజర్‌ తనకి చాలా నచ్చిందని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఫాన్స్ లాగే తాను కూడా టీజర్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూసినట్టుగా వెల్లడించారు. టీజర్‌ రెస్పాన్స్‌ కనుక్కొందామని నలుగురైదుగురికి ఫోన్  చేస్తే.. వాళ్ళు తనతో నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పారన్నారు.  బాహుబలి సినిమాకి కూడా ముందుగా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి కానీ సినిమా సూపర్‌ హిట్‌ అయిందన్నారు. తనాజీ మూవీ చూసేవరకి ఓం రౌత్ ఎవరో కూడా తనకు తెలియదని, ఆ సినిమా చూసాక అతనికి ఫ్యాన్ అయిపోయానన్నారు. వీఎఫ్‌ఎక్స్‌ సినిమాలను థియేటర్‌లో చూస్తే అర్థమవుతుందని, ఆదిపురుష్‌ కూడా అలాంటి సినిమానేనని దిల్ రాజు తెలిపారు. 

పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న ఆదిపురుష్ సినిమాకు  ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా, టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మిస్తున్నారు. ఇందులో కృతిసనన్ సీతగా,  సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కీలక పాత్రలు పోషిస్తున్నారు.  వచ్చే ఏడాది ఈ సినిమాను జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.