Spirit: ప్రభాస్ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘స్పిరిట్’ షురూ.. క్లాప్ కొట్టిన మెగాస్టార్.. వెయ్యి కోట్ల టార్గెట్తో సందీప్ రెడ్డి వంగా!

Spirit: ప్రభాస్ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘స్పిరిట్’ షురూ.. క్లాప్ కొట్టిన మెగాస్టార్.. వెయ్యి కోట్ల టార్గెట్తో సందీప్ రెడ్డి వంగా!

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit). భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశానంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (2025 నవంబర్ 23న) హైదరాబాద్లో స్పిరిట్ పూజా ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, క్లాప్ కొట్టి చిత్ర బృందానికి విషెష్ తెలిపారు.

అయితే, ఈ ఈవెంట్కి ప్రభాస్ కూడా అటెండ్ అయ్యి ఉంటే.. బొమ్మ మరింత రసవత్తరంగా ఉండేది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. 'యానిమల్' ఫేమ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటించనుంది.

ఇటీవల విడుదలైన ఆడియో టీజర్, ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. విజువల్స్‌ లేకుండా కేవలం ఆడియోతోనే సినిమా కథపై క్యూరియాసిటీ తీసుకొచ్చింది. ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ పాత్ర భారతదేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్ అని.. వాయిస్ ఓవర్ ద్వారా ప్రకటించడం అభిమానులను ఉర్రూతలూగించింది. టీజర్‌లో ప్రభాస్ మరియు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్లు వారి పాత్రల మధ్య గట్టి వైరాన్ని సూచిస్తున్నాయి.

ఇందులో ప్రకాష్ రాజ్ చెప్పిన ఒక బోల్డ్ డైలాగ్ సైతం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. జైలు సూపరింటెండెంట్ పాత్రలో ఉన్న ప్రకాష్ రాజ్, ప్రభాస్ పోషిస్తున్న ఖైదీ పాత్రను ఉద్దేశించి, ఖైదీని బట్టలూడదీసి టెస్టులకు పంపండి అని చెప్పడం ఆసక్తిని రెకెత్తించింది. 

ఈ పాన్ ఇండియా మూవీలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి- సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లలో ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీత అందిస్తున్న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు మాండరిన్, జపనీస్, కొరియన్ భాషల్లోనూ విడుదల కానుంది.