ఇది ప్రభాస్, షారుఖ్ వార్.. సర్వర్లు క్రాష్ అవడం ఖాయం

ఇది ప్రభాస్, షారుఖ్ వార్.. సర్వర్లు క్రాష్ అవడం ఖాయం

ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుండి ఇద్దరు బడా హీరోలు తమ స్టామినా చూపించడానికి రెడీ అయ్యారు. ఒక్క రోజు గ్యాప్ లో సోషల్ మీడియాలో వార్ షురూ చేయనున్నారు. ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas).. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan). ఈ ఇద్దరు స్టార్ హీరోలు తమ అప్ కమింగ్ సినిమాల టీజర్స్ ను ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో రచ్చ లేపనున్నారు.

Also Read : లవర్‌‌కు పెండ్లైందని.. యువకుడి అత్మహత్య

ప్రభాస్ హీరోగా, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకతంలో సలార్(Salaar) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ టీజర్ జులై 6న ఉందయం 5:12 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ టీజర్ రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక మరోపక్క బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జవాన్(Jawan). తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ ను జులై 7న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా కోసం కూడా షారుఖ్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇక ఈ రెండు సినిమా ల టీజర్లు ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ అవుతుండటంలో.. అభిమానులు సోషల్ మీడియా వార్ కు సిద్ధమయ్యారు. దీంతో యూట్యూబ్ సర్వర్లు క్రాష్ అవడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏ హీరో టీజర్ కు రికార్డ్ వ్యూస్ వస్తాయో చూడాలంటే మారో మూడు రోజులు ఆగాల్సిందే.