
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) పెద్దమ్మ, సీనియర్ హీరో కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి(shyamala devi) త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లోక్‌సభ నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే స్థానంలో రఘు రామకృష్ణంరాజు ఇప్పటికే ఎంపీగా ఉన్నారు. ప్రతుతం ఆయన వైసీపీ పార్టీకి రెబల్‌గా మారారు.
ఇందులో భాగంగానే కొత్త నేత కోసం వెతుకుతోందట వైసీపీ(YSRCP). దీంతో క్షత్రియ సామాజికవర్గానికి చెందిన శ్యామలాదేవిని ఎంపీగా పోటీ చేయించాలని చూస్తుందట వైసీపీ. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక ప్రభాస్ ఫ్యామిలీకి కూడా వైసీపీతో మంచి అనుబంధం ఉంది. ఈ ప్రతిపాదనకు గనుక శ్యామలాదేవి ఒప్పుకుంటే.. ఏపీలో ప్రభాస్ ఫ్యామిలీకి మంచి పట్టు రావడం ఖాయమనే రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్న మాట.