విజువల్ ట్రీట్ ఎలా ఉంటుందో!

V6 Velugu Posted on May 25, 2021

అదీ ఇదీ అంటూ అప్‌‌డేట్స్ రావడమే తప్ప.. ప్రభాస్ సినిమా థియేటర్‌‌‌‌కి వచ్చి మాత్రం చాలా కాలమైంది. మామూలుగానే తన సినిమాలు కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటాయి. దానికి తోడు కరోనా కూడా మాటిమాటికీ బ్రేక్ వేస్తూ ఉండటంతో మరింత ఆలస్యమవుతోంది. అయితే లేటైనా లేటెస్ట్‌‌గా వస్తాను, విజువల్ ట్రీట్ ఇస్తాను అంటున్నాడు ప్రభాస్. ‘రాధేశ్యామ్’లో లవర్ బోయ్‌‌గా, ‘సాలార్’లో ఆర్మీ ఆఫీసర్‌‌‌‌గా, ‘ఆదిపురుష్’లో రాముడిగా ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలు చేస్తున్నాడు. దాంతో ఒక్కో సినిమాలో ఒక్కో లుక్‌‌లో కనిపించబోతున్నాడు. అందుకే మేకోవర్‌‌‌‌ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. ముఖ్యంగా రాముడిలా కనిపించడం కోసం కాస్త ఎక్కువ కష్టమే పడుతున్నాడు. ప్రభాస్​ ఒక సరికొత్త డైట్‌‌ను ఫాలో అవుతున్నాడని లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ కూడా చెబుతున్నాడు. ప్రభాస్ తన లుక్ కోసం ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవడం లేదని, డైట్‌‌ని జాగ్రత్తగా మెయింటెయిన్ చేస్తున్నాడని రీసెంట్‌‌గా ఓ ఇంటర్వ్యూలో అన్నాడు సన్నీ. మరోవైపు  ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌‌లో తెరకెక్కుతున్న ‘సాలార్’ పూర్తి యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌. దాంతో కాస్త రగ్డ్‌‌ లుక్‌‌లో కనిపించబోతున్నాడు ప్రభాస్. అందులోనూ  సిక్స్‌‌ ప్యాక్‌‌లో కనిపిస్తాడట. ఇక పీరియాడిక్‌‌ రొమాంటిక్ డ్రామా ‘రాధేశ్యామ్’లో కూల్‌‌ అండ్ క్యూట్ లవర్‌‌‌‌గా ఎప్పుడూ లేనంత ప్రత్యేకంగా ఉంటాడట. ఓ భారీ షిప్ సెట్‌‌లో తీసిన సీన్స్ హైలైట్ అంటున్నారు. ఈ మూవీని జులై 30న  రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనాతో బ్రేక్ పడే చాన్స్ ఉంది. కొన్ని సీన్లు రీ షూట్ చేయాల్సి ఉందని, ఓ సాంగ్ కూడా పెండింగ్ ఉందనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఈ మూడు చిత్రాలూ ఒకదాని తర్వాత ఒకటిగా రిలీజవుతాయనైతే అర్థమవుతోంది. మరి డిఫరెంట్ లుక్స్‌‌లో ప్రభాస్‌‌ ఇవ్వబోయే విజువల్ ట్రీట్‌‌ ఎలా ఉంటుందో చూడాలి.
 

Tagged prabhas, RadheShyam, salaar, look, good visual treat

Latest Videos

Subscribe Now

More News