
ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ వచ్చేసింది. 2024, జూన్ 10వ తేదీ సోమవారం సాయంత్రం 7 గంటలకు ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యాక్షన్ సీన్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీ కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ మరో ప్రపంచాన్ని సృష్టించారు. గూస్ బంప్స్ వచ్చేలా ట్రైలర్ ఉంది. అభిమానులతోపాటు సినీ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను భారీగా పెంచేసిందీ ట్రైలర్.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె , దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ విడుదల కానుంది.