
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన కల్కి 2898 AD మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ప్రస్తుతం కల్కి థియేట్రికల్ రన్లో ఉండగానే ఓటీటీ రిలీజ్ డేట్కి సంబంధించి చాలా ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. కల్కి 6 వారాల తర్వాత అంటే ఆగస్టులో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వస్తుందంటూ పుకార్లు వినిపిస్తోన్న నేపథ్యంలో..చిత్ర నిర్మాతలు అటువంటి వార్తల్లో నిజం లేదన్నట్టుగా సమాచారం. వివరాల్లోకి వెళితే..
ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ గురించి సినిమా యూనిట్ క్లారిటీ వచ్చేసింది. తాము ఏ డిజిటల్ ప్లాట్ఫామ్కి అయితే సినిమాని అమ్మామో ఆ డిజిటల్ ప్లాట్ఫామ్లో..ఈ సినిమా రిలీజ్ అయిన 10 వారాల తర్వాత మాత్రమే స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అంటే, జూన్ 27 థియేటర్లో రిలీజైన ఈ సినిమా సెప్టెంబరు సెకండ్ వీక్లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. దీంతో ‘కల్కి’ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సినీ లవర్స్ కు ఇంకొన్ని రోజులు నిరీక్షణ తప్పదు.
కల్కి తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం వెర్షన్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ కు వస్తుండగా హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ రైట్స్‌ను సుమారు రూ. 378 కోట్ల భారీ మొత్తానికి ఈ రెండు ప్లాట్ ఫామ్స్ దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో కథ, కథనం, విజువల్స్, గ్రాఫిక్స్, వాటిని నాగ్ అశ్విన్ ప్రెజెంట్ చేసిన విధానానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. దాంతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన15 రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక రానున్న రోజుల్లో మరో వంద కోట్ల మేరకు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.